“విశ్వకర్మ”.. ఎందుకు నీకీ "ఖర్మ"
“కమ్మరి
కొలిమిల దుమ్ము పేరెను.. పెద్ద బాడిసా మొద్దు బారినది.. అరకల పనికీ ఆకలిదీరక, గడము నొగల
పని గాసమెల్లకా ఫర్నిచర్ పని వెతుక్కుంటూ ఆపట్నంబోయిర విశ్వకర్మలు.. ఆసాములంతా
కూసూనేటి ఆవడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దుక్కిస్తున్నదిరో నాపల్లెల్లోనా..
నారా, కెంపు, తెల్లలు
పరులకు తెలియని మరుగు బాషతో బేరం చేసే కంసాలి వీధులు వొన్నె తగ్గినవి
సిన్నబోయినవి.. చెన్నై, బాంబే కంపినులోచ్చీ మన స్వర్ణకారులా.. అరె శర్నకోలలై
తరుముతున్నయిరా నా పల్లెలనుండి.. చేతి వ్రుత్తులా చేతులిరిగిపాయే నాపల్లెల్లోన..
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసే ఈదేశంలోనా..”
దాదాపు 16 సంవత్సరాల క్రితం “కుబుసం” సినిమాలో
ప్రజా కవి గోరేటి వెంకన్న రాసిన పాటలోని విశ్వకర్మల దుస్థితి గురించి వర్ణించిన
పదాలు అక్షర సత్యాలుగా నిలిచినాయి.
ఒకప్పుడు దర్జాగా బతికిన విశ్వకర్మలు ఇప్పుడు బ్రతకలేక బ్రతుకీడుస్తూ
దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు.
పల్లెల్లో ఒకప్పుడు తొలి వాన చినుకులు పడ్డాయంటే చాలు విశ్వకర్మల కొట్టాలు
రైతులతో కళకళలాడుతూ ఉండేవి. రైతుకు అండగా
ఉండే మొదటి వ్యక్తి విశ్వకర్మ, రైతుకు గుండె నిండా ఆత్మస్థైర్యాన్ని నింపే మొదటి వ్యక్తీ
విశ్వకర్మ, రైతు
సంవత్సర కాలమంతా పంట పండాలని, రైతు బ్రతకాలని మనస్పూర్తిగా కోరుకునే మొదటి వ్యక్తీ
విశ్వకర్మ. ఏడాదంతా కష్టపడ్డ రైతు ఇంటికి
ధాన్యం వచ్చాక తన ఏడాది కాముదారి (ఏడాది కూలి) తీసుకొని రైతును నిండు మనసుతో
దీవించే వ్యక్తీ విశ్వకర్మ. ఏడాదిలో తన
మొదటి పని దినాన్ని మోతుబరి రైతుచే “దాతి పూజ”తో ప్రారంభించే శ్రామికుడు విశ్వకర్మ. అలాంటి విశ్వకర్మలకు నేడు చేతినిండా పని దొరకక, అప్పులపాలు
అయి ఆకలి చావులు చావాల్సిన దుర్గతి పట్టింది.
పల్లెల్లో పని దొరకక కొందరు పట్నాలకు వలస
వెళ్లి ప్రైవేటు కంపెనీలలో సెక్యూరిటీ గార్డులుగా, కొందరు ఎటిఎం సెంటర్లలో
వాచ్ మెన్లుగా, మరి
కొందరు దుకాణాల్లో సేల్స్ మెన్లుగా బ్రతుకీడుస్తూ బ్రతికేస్తున్నారు. కొందరు మాత్రం ఆధునిక ఫర్నిచర్ రంగంలోకి
అడుగుపెట్టి ఒ మోస్తారుగా గౌరవంగా బ్రతుకుతున్నారు, కాని
పల్లెల్లల్లో సంప్రదాయ కుల వృత్తి ఐన “వడ్రంగి, కమ్మర పని” పై
ఆధారపడి బ్రతికే వారి సంఖ్య మాత్రం నానాటికీ తగ్గిపోతోంది. చూడబోతూంటే పల్లెల్లల్లో విశ్వకర్మల కుల
వృత్తులు ఇక ముందు కనిపించకపోవొచ్చు.
అసలు ఈ కులానికున్న శాపం ఏమిటో తెలియదుగాని
సమాజంలో గౌరవం, పేరు
ప్రతిష్టలు, మొదలగునవి
అన్నీ ఉంటాయి కాని సిరి సంపదలు మాత్రం ఉండవు.
కొద్దో గొప్పో కొందరు ధనికులు ఈ సామాజిక వర్గంలో ఉన్నారంటే మాత్రం వారు ఈ
కుల వృత్తిని వోదిలేసినవారై ఉంటారు.
ఇందులో తప్పు పట్టుకోవలసిన పని లేదు ఇది అత్యధిక శాతం నిజం. వ్యవసాయ రంగంలో వొచ్చిన విప్లవాత్మక మార్పుల
మూలంగా పల్లెల్లో విశ్వకర్మలకు పని తగ్గి, పని దొరకని పరిస్థితి
ఎదురవుతోంది. రైతు వ్యవసాయంలో యంత్రాల
వినియోగం పెరగటం వలన ఈ దుస్థితి విశ్వకర్మలకు దాపురించింది. మరి ఈ మార్పు మంచిది కాదా? విశ్వకర్మల
కోసం రైతు యాంత్రీకరణ వైపుకు ముందుకు సాగాకూడదా? అని అనవచ్చు, వ్యవసాయంలో
యాంత్రీకరణ వల్ల పని తొందరగా, తక్కువ ఖర్చుతో రైతుకు మేలు జరుగుతుంది కాదనటంలేదు, కానీ
యాంత్రీకరణ వల్ల రైతులు వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గిపోవటం, వాటి
ఎరువు వారి పంట పొలాలలో పడకపోవటం వల్ల భవిష్యత్ తరాలకు మేలైన ఆహారం అందించలేని
దుస్థితికి కూడా మనం చేరుకోవొచ్చు.
విశ్వకర్మలను ప్రోత్సాహించటం కోసం రైతుకు లాభాన్నిచ్చే యాంత్రీకరణను దూరం
చేయమనటం లేదు. కానీ ఆ యాంత్రీకరణలో
విశ్వకర్మలను కూడా భాగం చేయమనటంలో తప్పేమీ లేదుగా, విశ్వకర్మలకు
వ్యవసాయ యంత్రాలను మరమ్మత్తులు చేయుటలో తగు శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలి, వారిని
ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణలో భాగస్వామ్యం చేయాలి, ఫర్నిచర్ పనిలో
క్రొత్తగా వచ్చిన ఆధునిక యంత్రాలను వారికి ఉచితంగా అందివ్వాలి. పల్లెల్లో ఉంటున్న విశ్వకర్మల “ఖర్మ”ను కొంతలో
కొంతైనా ప్రభుత్వమే చొరవ తీసుకొని మార్చాలి.
పల్లెల్లో జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమ, బెస్త, తదితర కుల
వ్రుత్తులవారిని ప్రభుత్వం ఉచితంగా ఎన్నో సదుపాయాలు కల్పించి ఎంతగానో
ప్రోత్సాహిస్తోంది కానీ విశ్వకర్మలను మాత్రం గాలికి వదిలేసింది అని విశ్వకర్మలు
వాపోతున్నారు, మాకెందుకు
ఈ ‘ఖర్మ’ అని వారి
గోడు వెళ్లగక్కుతున్నారు.
ఇదిలాఉంటె, విశ్వకర్మలలో
మరో వర్గమైన స్వర్ణకారుల పరిస్థితి కూడా కడు దయనీయంగా ఉంది. గతంలో పల్లెల్లో పెళ్లి పెట్టుకుంటే ఆఊరిలో
స్వర్నకారుని దగ్గరే పెళ్లికి సంభందించిన నగలు చేయించుకోవటం సంప్రదాయంగా ఉండేది, స్వర్ణకారులు
పెళ్ళిళ్ళ సీజన్లో సంపాదించిన సంపాదనతో సంవత్సరం అంతా తమ జీవనాన్ని
సాగించేవారు. మారిన పరిస్థుతుల కారణంగా
నగరాలలో కార్పోరేట్ సంస్థలు అందిస్తున్న భంగారు నగల మోజులో పడి, వాటికి
సినిమా తారల ప్రచారాలకు ఆకర్షితులై పల్లెల్లో స్వర్ణకారులు ఎంతో శ్రమకోర్చి తయారు
చేస్తున్న నగల వంక సామాన్య మానవుడు కూడా చూడకపోవడంతో పల్లె స్వర్ణకారులు పట్నం బాట
పడుతున్నాడు, చిన్న
చితక జీతాలతో వాచ్ మాన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా, నగల దుకాణంలో రోజు కూలిగా, సేల్స్
మాన్లు గా బ్రతుకీడుస్తున్నారు. వీరి
బ్రతుకుల్లో వెలుగు నింపాలంటే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసి పల్లెల్లో నగల దుకాణం
పెట్టుకొనుటకు సహకరించాలి.
విశ్వకర్మల అభివృద్ధి కుంటుబడటానికి మూల
కారణం వారిలో ఉన్న ఐదు కులాల మధ్య పొసగని ఐఖ్యత, వారి సంక్షేమం
కోసం వారి కుల నాయకులు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడిని తీసుకురాలేక పోవడం, నిధుల
వినియోగంలో సత్వర స్పందన లేకపోవడం, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు
దశాబ్దాలు గడుస్తున్నా కూడా విశ్వకర్మలు చట్ట సభలలో తగిన సంఖ్యలో అడుగు
పెట్టకపోవడం, వారి
వాణిని చట్ట సభలలో వినిపించే నాధుడు లేకపోవడం పెద్ద మైనస్ గా తెలుపుతున్నారు
విశ్వకర్మ యువత. ఈ పరిస్థితిని సమూలంగా
మార్చడానికి నడుం బిగించింది "విశ్వబ్రాహ్మణ జాగృతి
సమితి". చట్ట సభలలో
విశ్వబ్రాహ్మణులు అడుగు మోపేలా, రాజకీయ చైతన్యం తెచ్చేలా, ఇప్పటికే
రాజకీయాల పై అవగాహన ఉంది, ప్రజా
క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ నాయకులను ప్రోత్సాహించేందుకు విశ్వబ్రాహ్మణ
రాజకీయ నాయకుల గురించి ప్రజలకు తెలియజేయడానికి, పబ్లిసిటీ ఇవ్వడానికి సామాజిక
మాధ్యమాలు అయినా పేస్ బుక్, వాట్సాప్, వెబ్ సైట్
ను ప్రారంభించి క్రియాశీలకంగా ముందుకు సాగుతోంది.
ఇందుకోసం విశ్వబ్రాహ్మణ యువత ముందుకురావాలని సాదరంగా ఆహ్వానిస్తోంది. ఈ మహా కార్యంలో పాలుపంచుకోవాల్సిందిగా "విశ్వబ్రాహ్మణ
జాగృతి సమితి" వ్యవస్థాపకులు శ్రీనివాస్ గుండోజు
విశ్వబ్రాహ్మణ యువతను ఆహ్వానిస్తున్నారు.
జిల్లా స్థాయి నాయకులుగా ఈ అసోసియేషన్ లో భాగస్థులు కాదల్చిన వారు ఈ
క్రింది ఈమెయిల్ ఐడి కి వారి ఫోటో తో వారి వివరాలు వారు నిర్వహిస్తున్న వృత్తి, విశ్వబ్రాహ్మణ
సంఘంలో ఏదైనా పదవిలో ఉంటె అట్టి వివరాలు తెలుపుతూ ఈ-మెయిల్ చేయగలరని కోరుచున్నారు.
ఆర్టికల్ వ్రాసినది: శ్రీనివాస్ గుండోజు
శ్రీనివాస్ గుండోజు
విశ్వబ్రాహ్మణ జాగృతి సమితి,
ఫోన్: 9985188429.
ఈ-మెయిల్: srinivasvbjs@gmail.com
Comments
Post a Comment