విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గురించి..
సిరికొండ మధుసూధనాచారి తెలంగాణా రాష్త్ర తొలి శాసనసభ స్పీకర్. 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్ జిల్లా భూపాలపల్లి అసెంబ్లీ నియోజ వర్గం నుంచి టిఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికైనారు.
స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపుతో సిరికొండ మధుసూధనాచారి 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయనకు నమ్మినబంటుగా పేరు తెచ్చుకు న్నారు.మొదటి సారిగా 1994-99 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి సారిగా చట్టసభలో ప్రవేశిం చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న సమయంలో కేసీఆర్‌కు దగ్గరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపనకు 8 నెలల ముందు నుండే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. పార్టీ ప్రతి ప్రస్థానంలో మధుసూధనా చారి రాజకీయాలలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారు. . పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చారి తనదైన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 1994లో అసెంబ్లీకి మొదటి సారిగా ఎన్నికై వచ్చే సమయం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీన్ని చూసి చలించి పోయిన మధుసూధనాచారి పత్తిరైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పురుగుల మందును సభలోకి తెచ్చారు. 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టిఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికైనారు.
మచ్చలేని మన మధుసూధనుడిని అధిక మెజారిటీ తో గెలిపించి మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించేలా చేయడం ఒక విశ్వబ్రాహ్మణుడిగా మన బాధ్యతగా భావించినట్లైతే ఈ పోస్టు ను షేర్ చేయగలరు.
Comments
Post a Comment