Posts

Showing posts from October, 2018

“విశ్వకర్మ”.. ఎందుకు నీకీ "ఖర్మ"

Image
“ కమ్మరి కొలిమిల దుమ్ము పేరెను.. పెద్ద బాడిసా మొద్దు బారినది.. అరకల పనికీ ఆకలిదీరక , గడము నొగల పని గాసమెల్లకా ఫర్నిచర్ పని వెతుక్కుంటూ ఆపట్నంబోయిర విశ్వకర్మలు.. ఆసాములంతా కూసూనేటి ఆవడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దుక్కిస్తున్నదిరో నాపల్లెల్లోనా.. నారా , కెంపు , తెల్లలు పరులకు తెలియని మరుగు బాషతో బేరం చేసే కంసాలి వీధులు వొన్నె తగ్గినవి సిన్నబోయినవి.. చెన్నై , బాంబే కంపినులోచ్చీ మన స్వర్ణకారులా.. అరె శర్నకోలలై తరుముతున్నయిరా నా పల్లెలనుండి.. చేతి వ్రుత్తులా చేతులిరిగిపాయే నాపల్లెల్లోన.. అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసే ఈదేశంలోనా.. ” దాదాపు 16 సంవత్సరాల క్రితం “ కుబుసం ” సినిమాలో ప్రజా కవి గోరేటి వెంకన్న రాసిన పాటలోని విశ్వకర్మల దుస్థితి గురించి వర్ణించిన పదాలు అక్షర సత్యాలుగా నిలిచినాయి.   ఒకప్పుడు దర్జాగా బతికిన విశ్వకర్మలు ఇప్పుడు బ్రతకలేక బ్రతుకీడుస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు.   పల్లెల్లో ఒకప్పుడు తొలి వాన చినుకులు పడ్డాయంటే చాలు విశ్వకర్మల కొట్టాలు రైతులతో కళకళలాడుతూ ఉండేవి.   రైతుకు అండగా ఉండే మొదటి వ్యక్తి విశ్వకర్మ , రైతుకు గుండె నిండా ఆత్మస్థైర్యా

విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గురించి..

Image
సిరికొండ మధుసూధనాచారి తెలంగాణా రాష్త్ర తొలి శాసనసభ స్పీకర్. 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్‌ జిల్లా భూపాలపల్లి అసెంబ్లీ నియోజ వర్గం నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌పై ఎన్నికైనారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ పిలుపుతో సిరికొండ మధుసూధనాచారి 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయనకు నమ్మినబంటుగా పేరు తెచ్చుకు న్నారు.మొదటి సారిగా 1994-99 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి సారిగా చట్టసభలో ప్రవేశిం చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న సమయంలో కేసీఆర్‌కు దగ్గరయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు 8 నెలల ముందు నుండే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. పార్టీ ప్రతి ప్రస్థానంలో మధుసూధనా చారి రాజకీయాలలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారు. . పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చారి తనదైన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 1994లో అసెంబ్లీకి మొదటి సారిగా ఎన్నికై వచ్చే సమయం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీన్ని చూసి చలించి పోయిన మధుసూధనాచారి పత్తిరైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం